BJP : నేడు రాజమండ్రికి బీజేపీ చీఫ్ మాధవ్
నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాజమండ్రిలో పర్యటించనున్నారు
నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాజమండ్రిలో పర్యటించనున్నారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో ఆయన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మాధవ్ పాల్గొననున్నారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో జరగనున్న పలు పార్టీ కార్యక్రమాల్లో మాధవ్ పాల్గొననున్నారు.
గోదావరి పుష్కరాలు...
గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ పుష్కర్ ఘాట్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. దీంతో పాటు బీజేపీ ముఖ్య నేతలతో మాధవ్ సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారని తెలిసింది.