రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

Update: 2026-02-23 03:44 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌లో సునీల్ నాయక్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. బిహార్ కేడర్‌కు చెందిన సునీల్ నాయక్వైసీపీ హయాంలో డిప్యూటేషన్‌పై సీఐడీలో పనిచేశారు.

సునీల్ నాయక్ అరెస్ట్...
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ సునీల్ నాయక్ వెళ్లిపోయారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ పాత్రపై ఫిర్యాదు అందడంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు బీహార్ వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. నేడు విచారించి కోర్టులో హాజరు పర్చే అవకాశముందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News