నేడు స్వామి పిటీషన్ పై విచారణ
లడ్డూ కల్తీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగే అవకాశముంది
తిరుమల తిరుపతి దేవస్థానం లో లడ్డూ కల్తీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగే అవకాశముంది. మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్యణ్య స్వామి సుప్రీంకోర్టులో ఈ పిటీషన్ వేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ దర్యాప్తు చేసి నివేదిక అందించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడంపై స్వామి ఈ పిటీషన్ దాఖలు చేశారు.
ఆదేశాలకు వ్యతిరేకంగా ...
సుప్రీంకోర్టుకు ఆదేశాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుబ్రహ్మణ్య స్వామి తప్పుపడుతూ ఈ పిటీషన్ వేశారు. ఈ కమిటీ విచారణను నిలుపుదల చేయాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడంతో ఇప్పడు నేడు విచారణకు వచ్చే అవకాశముంది. ఈ పిటీషన్ లో చంద్రబాబును, ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు.