Nara Lokesh : నేడు డిల్లీకి మంత్రి నారా లోకేశ్
నేడు డిల్లీకి మంత్రి నారా లోకేశ్ బయలుదేరి వెళ్లనున్నారు
నేడు డిల్లీకి మంత్రి నారా లోకేశ్ బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు మంత్రివర్గ సమావేశం అనంతరం లోకేశ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటల కు నారా లోకేశ్ ఢిలల్లీ చేరుకోనున్నారు. ఈరోజు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న మంత్రి నారా లోకేశ్ పార్లమెంటు సభ్యులతో భేటీ అవుతారు.
రేపు కేంద్ర మంత్రులతో...
రేపు ఉదయం పార్లమెంట్ కు మంత్రి నారా లోకేశ్ వెళ్ళనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, నిధుల విడుదలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గురించి కూడా వివరించనున్నారు. అనంతరం రేపు అర్ధరాత్రి కి ఉండవల్లి నివాసం కు మంత్రి నారా లోకేశ్ రానున్నారు.