Pawan Kalyan : పవన్ ఒక్కరే ఉన్నారా? మాస్ ఇమేజ్ మళ్లీ అధికారాన్ని తెచ్చిపెడుతుందా?

జనసేన పార్టీ స్థాపించి పదమూడేళ్లు కావస్తుంది.

Update: 2026-03-20 09:00 GMT

జనసేన పార్టీ స్థాపించి పదమూడేళ్లు కావస్తుంది. అయితే పవన్ కల్యాణ్ మైండ్ సెట్ మాత్రం వేరేలా ఉంది. పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు లేవు. పవన్ కల్యాణ్ కు ఇప్పటికీ మాస్ ఇమేజ్ ఉంది. . జనసేన జెండా లేని వీధి, జనసైనికులు లేని వీధులు అనేకం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం అందరి మనస్సుల్లో ఉన్నారు. రాజకీయాలను మారుస్తారని, అవసరమైతే ప్రశ్నిస్తారని ఆయనపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. మంత్రిగా ఆయన సక్సెస్ అనే చెప్పాలి. తనకు అప్పగించిన బాధ్యతలను పవన్ కల్యాణ్ నెరవేరుస్తున్నారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు.

అనేక గ్రామాల్లో...
కానీ ఇప్పటికే ఏపీలోని అనేక గ్రామాల్లో పార్టీ లేదు. ఎవరు వచ్చే ఎన్నికలలో పోటీ చేసినా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను చేరవేసేది క్యాడర్ మాత్రమే. కానీ ఆ క్యాడర్ విషయంలోనే పవన్ కల్యాణ్ సీరియస్ గా దృష్టిపెట్ట లేకపోతున్నారు. ఎన్నికలంటే కేవలం అభిమానం ఒక్కటి మాత్రమే సరిపోదు. అనేక ప్రలోభాలు పనిచేస్తాయి. పోలింగ్ ఏజెంట్లు కూడా కీలకం. పోటీ చేసే శక్తిగల అభ్యర్థులు కూడా అవసరం. ఎన్నికల ఖర్చు పెట్టుకునే వారిని ఇతర పార్టీల నుంచి తీసుకుంటే ఈసారి ఉన్న క్యాడర్ కూడా అంగీకరించే పరిస్థితి లేదు. మొన్నటి పరిస్థితి వేరు. ఈసారి పరిస్థితి వేరు.
వెనక్కు తిరిగి చూస్తే...
నిజానికి వెనక్కు తిరిగి ఒకసారి చూసుకుంటే 2014లో పార్టీ ఎక్కడ ఉందో 2026లోనూ అక్కడే ఉందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పవన్ అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సొంత చరిష్మాతోనూ, నిజాయితీతోనూ ఓటింగ్ శాతం కొంత పెంచుకునే అవకాశం ఉండవచ్చు. కానీ ఎలక్షనీరింగ్ చేసే విషయంలో మాత్రం బీజేపీ కంటే జనసేన వెనకబడి ఉందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదంటున్నారు. పవన్ కళ్యాణ్ కోసమే పనిచేసిన వారు..అతి కొద్ది మంది మినహా..మిగతావారు అంతా ఆర్దికంగా చితికిపోయారు.కెరీర్ పరంగా ఎదుగుదల లేదన్నది వారి నుంచి వినిపిస్తున్న ఆరోపణ. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ మరొక శక్తిగా మారే అవకాశాన్ని ఆయనే చేజేతులా జార విడుచుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.




Tags:    

Similar News