Ys Vijayamma : జగన్ కు షాకిచ్చిన వైఎస్ విజయమ్మ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వరకూ ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని వైఎస్ విజయమ్మ తెలిపారు.

Update: 2026-03-20 11:44 GMT

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వరకూ ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని వైఎస్ విజయమ్మ తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఒక నోట్ విడుదల చేశారు. " 2009లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగ లేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలుకు సమానంగా పంచాలని వైఎస్సార్ ఉద్దేశ్యం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమిది" విజయమ్మ లేఖలో పేర్కొన్నారు.

నలుగురికి సమానంగా...
ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంవోయూ రాశాడు. (నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్ తో సహా ఎంవోయూలో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే). ఆస్తులు విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగ లేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్సార్ జగన్‌కు కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు ? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయo. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే". అని వైఎస్ విజయమ్మ లేఖలో పేర్కొన్నారు.


Tags:    

Similar News