Andhra Pradesh : పదో తరగతి పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసింది

Update: 2026-03-20 05:06 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసింది. రేపు శనివారం రంజాన్ పండగ కావడంతో ఈ పరీక్ష తేదీని మార్పు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రంజాన్ సెలవు దినం కావడంతో రేపు జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది.

ఏప్రిల్ 2వ తేదీన...
ఈ పరీక్షను తిరిగి ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నారు. మిగిలిన పరీక్షలన్నీ యధాతధంగానే నిర్వహిస్తాయి. అన్నీ పరీక్షలను ముగిసిన తర్వాత ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోనూ, హాల్ టిక్కెట్లలోనూ ఎలాంటి మార్పులు ఉండవని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News