Chandrababu : నేడు తిరుమలకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు వెళ్లనున్నారు

Update: 2026-03-20 03:33 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు కచేరుకుంటారు. రేపు నారా దేవాన్ష్ పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులందరూ తిరుమలకు వెళతారు. రేపు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటారు.

దేవాన్ష్ పుట్టిన రోజుకు...
నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారి అన్నదానానికి ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు కుటుంబం విరాళం అందిస్తుంది. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్కు 44 లక్షల రూపాయలను విరాళాన్ని అందించబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు స్వయంగా అన్న ప్రసాదాలను భక్తులకు వడ్డించనున్నారు.


Tags:    

Similar News