అవినాష్ రెడ్డీ నాటకాలు ఆపు : బీటెక్ రవి
వైఎస్ వివేకా హత్యపై అవినాష్‌రెడ్డి వ్యాఖ్యలను బీటెక్ రవి ఖండించారు
వైఎస్ వివేకా హత్యపై అవినాష్‌రెడ్డి వ్యాఖ్యలను బీటెక్ రవి ఖండించారు. హత్యకు స్పాట్ పెట్టింది.. రక్తపు మరకలు శుభ్రం చేయించింది అవినాష్‌రెడ్డి అని బీటెక్ రవి అన్నారు. ఇప్పుడు తానేదో నిజాయితీపరుడు అన్నట్లు అవినాష్‌రెడ్డి మాట్లాడుతున్నారని, వివేకా గుండెపోటు నాటకమాడిందెవరో దేశం మొత్తం తెలుసునని బీటెక్ రవి చెప్పారు. గుండెపోటు సృష్టి సునీతదేనని అవినాష్ అసత్యాలు వల్లెవేస్తున్నారన్న బీటెక్ రవి రక్తపు మరకలను తుడిచిన వారిని కాపాడేందుకే అవినాష్‌రెడ్డి నాటకాలు అని అన్నారు.
అన్నీ అబద్ధాలేనంటూ...
సునీత, సౌభాగ్యమ్మ గత ఎన్నికల్లో పోటీకి ఒప్పుకుంటే అవినాష్ ఎక్కడ ఉండేవారని బీటెక్ రవి ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డికి ఎంపీ పదవి సునీత పెట్టిన భిక్ష అని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి తెలిపారు. వివేకా హత్యకేసులో నిజానిజాలపై పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్ద చర్చకు సిద్ధమా? అని బీటెక్ రవి నిలదీశారు.