గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ పై నిఘా ఏర్పాటు చేయాలి

రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష చేశారు.

Update: 2026-03-20 12:38 GMT

రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష చేశారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లతో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. గృహ అవసరాలకు సంబంధించి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా లో ఇబ్బంది లేదని, వినియోగదారులు అనవసర అపోహలు, ఆందోళన పడాల్సిన అవసరం లేదని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా గ్యాస్ నిల్వలు, సరఫరా, డెలివరీలపై ప్రజల్లో జిల్లా అధికారులు అవగాహన కలిగించాలని ఆదేశించారు.

వాణిజ్య అవసరాలకు...
వాణిజ్య అవసరాలకు సంబంధించిన గ్యాస్ కూడా ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేయాలని, దీనికి జిల్లాల వారీగా ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి ముందుకు వెళ్లాలని కోరారు. ఆసుపత్రులు, పాఠశాలలు, వసతి గృహాలకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రానివ్వొద్దని నాదెండ్ల మనోహర్ అన్నారు. గ్యాస్ సరఫరా చైన్ క్రమబద్ధంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని, గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్ ఎట్టి పరిస్థితుల్లో వాణిజ్య అవసరాలకు మళ్లిపోకుండా బ్లాక్ మార్కెట్ ను నిరోధించాలని, దీనికోసం ప్రత్యేకమైన నిఘా బృందాలను ఏర్పాటు చేయాలిలని ఆదేశించారు. ఏజెన్సీల వారీగా ఎప్పటికప్పుడు బుకింగ్ లు, సరఫరా, డెలివరీలపై పర్యవేక్షణ ఉండాలని, అనుమానిత లావాదేవీలు ఏవైనా జరిగితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.


Tags:    

Similar News