రంజాన్ సెలవు రేపు
రంజాన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు సెలవు దినం ప్రకటించింది
రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన సెలవు దినం శుక్రవారానికి బదులు ఈనెల 21వ తేది శనివారానికి మారుస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.రంజాన్ పర్వదినం సందర్భంగా ఈనెల 20వ తేదీ శుక్రవారం సెలవు దినంగా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే శుక్రవారం నెలవంకకనిపించని కారణంగా వక్ఫ్ బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి విజ్ఞప్తి మేరకు రంజాన్ సాధారణ సెలవును ఈనెల 20వ తేది శుక్రవారానికి బదులు 21వ తేదీ శనివారానికి మార్చినట్టు వెల్లడించింది.
నేడు యధావిధిగా...
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ యదావిధిగా పనిచేస్తాయని చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ స్పష్టం చేశారు. అదే విధంగా షాపులు మరియు ఇతర ఎస్టాబ్లిష్మెంట్లకు సంబంధించి నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్ యాక్ట్ 1881 కు అనుగుణంగా రంజాన్ సాధారణ సెలవును 20వ తేది శుక్రవారానికి బదులుగా 21వ తేది శనివారానికి మారుస్తూ భుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.