ఏపీలో భూముల రీసర్వే.. భయాందోళనలు వద్దు

ఆంధ్రప్రదేశ్ లో యజమానుల సమక్షంలోనే భూముల రీ-సర్వే చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు

Update: 2025-01-20 02:33 GMT

ఆంధ్రప్రదేశ్ లో యజమానుల సమక్షంలోనే భూముల రీ-సర్వే చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అయితే యజమానుల సమక్షంలోనే భూముల రీసర్వేచేస్తామని మంత్రి వెల్లడించారు. ఎవరూ భయాందోళనలకు గురి కావద్దని, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే కూటమి ప్రభుత్వం ఈ భూముల రీసర్వే చేస్తుందని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.

యజమానులు వచ్చి...
యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు మూడుసార్లు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. అప్పటికీ రాకుంటే వీడియోకాల్ ద్వారా ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు. ఈనెల 20 నుంచి ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద రీ-సర్వే ప్రారంభిస్తాం అని తెలిపారు. గత ప్రభుత్వంలో భూములను ఆక్రమణలకు గురి కావడంతో పాటు అనేక అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు అందినందున ఈ రీ సర్వే ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.


Tags:    

Similar News