Nara Lokesh : నేటి నుంచి నారా లోకేశ్ విదేశీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు

Update: 2025-12-06 02:08 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిఈ నెల 10వ తేదీ వరకూ విదేశాల్లో పర్యటించనున్నారు.అమెరికా, కెనడాలో ఐదు రోజుల పాటు పర్యటిస్తారు. తొలిరోజు డల్లాస్ లో పర్యటించే నారా లోకేశ్ డయాస్సోరా సమావేశంలో పాల్గొంటారు.

పెట్టుబడులను ఆహ్వానించేందుకు...
అనంతరం ఈ నెల 8,9 తేదీల్లో శానన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలిని కోరనున్నారు. 10వ తేదీన కెనడాలోని టొరొంటోలో నారా లోకేశ్ పర్యటిస్తారు. అక్కడ ప్రముఖులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల ఏర్పాటు చేయాలని కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వీలయినన్ని పెట్టుబడులు తీసుకు రావడానికి లోకేశ్ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.


Tags:    

Similar News