Weather Reoprt : అయ్యబాబోయ్.. మళ్లీ వానలా.. తట్టుకునేదెలా?

తుపాను ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది

Update: 2025-11-24 04:47 GMT

దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిది. ఇది వాయుగుండంగా మారే అవకాశుముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరికొన్ని గంటల్లోనే తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలలో కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. ఈరోజు, రేపు భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. తుపాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

రెండు రోజుల పాటు వానలు
ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచే అల్పపీడన ప్రభావం చూపుతుంది. ఈ నెల 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతారణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాల్లో తేలిక పాటి జల్లుల నుంచి మోస్తరు వానలు పడతాయని చెప్పింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఇప్పటికే చలిగాలుల తీవ్రం కావడంతో ఈ తుపాను ప్రభావంతో మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం, సాయంత్రం వేళ వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటం మంచిదని సూచించింది.
తెలంగాణలోనూ చలి.. వర్షం...
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడతాయని చెప్పింది. ఇప్పటికీ తెలంగాణలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్లతో పాటు హైదరాబాద్ నగరంలోనూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోయాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం వేళ పొగమంచు ఉండటంతో ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలని సూచించింది.


Tags:    

Similar News