Andhra Pradesh : నేడు ఏపీ స్కూళ్లలో మెగా టీచర్ పేరెంట్ మీట్
ఆంధ్రప్రదేశ్ లో నేడు మెగా పేరెంట్ - టీచర్ల సమావేశం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు మెగా పేరెంట్ - టీచర్ల సమావేశం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ పేరెంట్ టీచర్ల సమావేశానికి ముఖ్య నాయకులు హాజరవుతున్నారు. బాపట్లలో జరిగే పేరెంట్ టీచర్ల మీట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు. ఇప్పటికే చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ కడప జిల్లాలో జరిగే పేరెంట్ - టీచర్ మీట్ లో పాల్గొంటారు.
హాజరు కానున్న నేతలు...
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ - టీచర్ మీట్ జరుగుతుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈకార్యక్రమానికి హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీట్ జరుగుతుంది. విద్యార్థులు, స్కూళ్ల అభివృద్ధిపై టీచర్లు, తల్లిదండ్రులు చర్చించనున్నారు. అనంతరం తల్లులకు రంగోలి పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించనున్నారు.