Janasena : నేడు జనసేనలో కీలక నేతల చేరికలు
నేడు జనసేనలో వైసీపీకి చెందిన కీలక నేతలు చేరనున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికలు జరగనున్నాయి.
ycp leaders joining in janasena
నేడు జనసేనలో వైసీపీకి చెందిన కీలక నేతలు చేరనున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికలు జరగనున్నాయి. ఒకేసారి ముగ్గురు కీలక నేతలు మూడు జిల్లాలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి కిలారు రోశయ్య, కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీలో చేరనున్నారు.
ముగ్గురు నేతలు...
ముగ్గురు వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన వారే. ఓటమి తర్వాత ముగ్గురు నేతలు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. ముగ్గురు నేతలతో పాటు ముఖ్య అనుచరులు కూడా ఈరోజు జనసేనలో చేరే అవకాశముంది. ఈ ముగ్గురు నేతలు ఇప్పటికే వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు.