Andhra Pradesh : ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడని భావిస్తున్న అనిల్ చోకరా ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలో ఉన్న అనిల్ చోకరాను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నుంచి విజయవాడ తీసుకు వచ్చి ఆయనను విచారిస్తున్నారు. ఈరోజు అనిల్ చోకరాను ఏసీబీ కోర్టులో హాజరు పర్చే అవకాశముంది.
అనిల్ చోకరా అరెస్ట్ తో...
అనిల్ చోకరా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిట్ అధికారులు గత కొంత కాలంగా ఆయన కోసం వెదుకుతున్నారు. ప్రధాన నిందితులైన రాజ్ కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డడిలకు సంబంధించిన నగదును వైట్ గా మార్చడంలో అనిల్ చోకరా కీలకంగా వ్యవహరించారని అంటుున్నారు. అనేక కంపెనీల ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చినట్లు అనుమానించిన పోలీసులు ఆ దిశగా అనిల్ చోకరాను విచారిస్తున్నారు.