Andhra Pradesh : మెడలో పూలమాల.. అదే మాయ.. ఈ యువతి ట్రాప్ లో చిక్కారో ఇక అంతే

యువతులు మగాళ్లను పెళ్లిళ్ల పేరుతో మోసగించడం పరిపాటిగా మారింది

Update: 2025-12-28 04:24 GMT

యువతులు మగాళ్లను పెళ్లిళ్ల పేరుతో మోసగించడం పరిపాటిగా మారింది. వధువులు దొరకకపోవడంతో కొందరు యువతులు నిత్య పెళ్లి కూతుళ్లుగా మారి అయిన కాడికి దోచుకుంటున్నారు. వివాహం చేసుకుంటామని నమ్మించి మోసం చేసే వారి సంఖ్య దేశంలో ఎక్కువయింది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఒక యువతి అనేక మంది యువకులను పెళ్లి పేరుతో మోసం చేసిన ఘటన అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఎనిమిది మంది భర్తలను పెళ్లిళ్ల పేరిట మార్చిన యువతి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లాకి చెందిన యువతిపై కు బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించటంతో ఆ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం బయట పడింది.

ఇచ్చాపురం పట్టణానికి...
ఇచ్చాపురం పట్టణానికి చెందిన ఒక యువతి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నిత్య పెళ్లి కూతురుగా మారుతూ ఎనిమిది మందిని మోసగించింది. తన మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరిట మగవారిని నమ్మించి మోసగించడంతో పాటు ఆభరణాలతో జంప్ కావడం అలవాటుగా మార్చుకుంది. పెళ్లి కాని ప్రసాదులను ఎంచుకొని వారి నుంచి ఎదురు కట్నం తీసుకొని పెళ్లికి సిద్ధం అవుతుంది. తీరా పెళ్లయ్యాక వారం రోజుల్లోనే చెప్పచెయ్యకుండా వరుడు తరుపున పెట్టిన బంగారు నగలతో పరారరవ్వడం ఈ యువతి ప్రత్యేకత. ఇటీవల శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని దుర్గాదేవి ఆలయంలో కర్ణాటకకు చెందిన వ్యక్తినీ పెళ్లి చేసుకుని అతనిని కూడా మోసం చేసింది.
రైలు నుంచి తప్పించుకుని...
వివాహం అనంతరం వరుడు సొంత ఊరు కర్ణాటక వెళుతున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో వరుడుతో కలిసి ట్రైన్ ఎక్కిన ఆమె విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద బాత్ రూమ్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్ళి ట్రైన్ దిగి మామమయింది. అనంతరం ఇచ్చాపురం లోని మేనత్త ఇంటికి చేరుకుంది. ఆ యువతి కోసం అంతా వెతికి చివరకు మేనత్త ఇంట్లో ఉందని తెలుసుకుని వారు అక్కడకు వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో వరుడి తరుపున బంధువులు తాము మోసపోయామని గ్రహించిందిఇచ్చాపురం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇప్పటి వరకు 8 మందిని పెళ్లిళ్లు చేసుకున్నట్టు ఫోటోలను ,వీడియోలను సంపాదించి ఆధారాలుగా పోలీసులకు వాటిని అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





Tags:    

Similar News