మీసం తిప్పిన బాలయ్య

అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

Update: 2023-09-21 05:05 GMT

టీడీపీ ప్రొతెస్త్స్ ఇన్ అసెంబ్లీ ఫర్ కేబిన్ అరెస్ట్ 

అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ సభ్యులు నిరసన తెలియజేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మీసం తిప్పి అధికార వైసీపీకి సవాల్ విసిరారు. దీనికి మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఇది సినిమా కాదని, సినిమాల్లో తిప్పుకోవాలని, ఇక్కడేం కుదరదని అంబటి బాలయ్య బాబుకు కౌంటర్ ఇచ్చారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్ సభను స్థంభింప చేసింది.

ఇరు వర్గాలు...
తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టారు. బీఏసీలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుందామని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. అయినా ఎంతకూ నిరసనలు ఆగకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభను వాయిదా వేశారు. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి? అజెండా ఏంటి? అన్న అంశాలపై చర్చించనున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య మాత్రం తొలి రోజే వాడి వేడిగా వాగ్వాదాలు జరుగుతూ తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.


Tags:    

Similar News