Weather Report : ముందే రుతుపవనాలు... ఈసారి మాత్రం తడిసి ముద్ద్వాల్సిందేనట

భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు మరికొద్ది రోజుల్లో అండమాన్ లో ప్రవేశించనున్నాయి

Update: 2025-05-14 04:06 GMT

భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు మరికొద్ది రోజుల్లో అండమాన్ లో ప్రవేశించనున్నాయి. కేరళను కూడా ఈ నెలలోనే తాకనున్నాయి. తెలంగాణలో వచ్చే నెల 12వ తేదీనాటికి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 21 వ తేదీ నాటికి సహజంగా అండమాన్ కు నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి అయితే ఈసారి కొంత ముందుగానే ప్రవేశించనున్నాయి. అయితే ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూన్ నెల నుంచి జులై నెల వరకూ వర్షాలు భారీగా పడే అవకాశముందని తెలిపింది.

భారీ ఉష్ణోగ్రతలు...
అయితే ఈ లోపు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. నలభై ఐదు డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని కూడా పేర్కొంది. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని, మరో నెల రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతతో పాటు వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వాతావరణ శాఖ సూచించింది. పగటి వేళల్లో వీలయినంత వరకూ బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. ముఖ్యంగా చిరు వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. రోజు వారీ కూలీలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.
తెలంగాణలో నేడు...
ఆంధ్రప్రదేశ్ లో నేడు ఉత్తర కోస్తా, రాయలసీమల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని కూడా చెప్పింది. తెలంగాణలోనూ వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతాయని చెప్పింది. మరో నాలుగు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కూడా చెప్పింది. ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని పేర్కొంది. ఈరోజు మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అధిక వర్షాలతో పాటు వడగండ్ల వాన కూడా పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకోవాలని కూడా సూచించింది. వేడిగాలుల తీవ్రత పగటి వేళ ఎక్కువగా ఉంటుందని చెప్పింది.


Tags:    

Similar News