బెయిల్ పిటీషన్ తిరస్కరణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

Update: 2022-08-01 07:30 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈరోజు హైకోర్టు ఈమేరకు తీర్పు చెప్పింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులైన సునీల్ యాదవ్, ఉమా మహేశ్వర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి లు తమకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.

ముగ్గురి తరుపున....
నిందితుల తరుపున న్యాయవాది, సీబీఐ తరుపున న్యాయవాది సుదీర్ఘ వాదననలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు చెప్పింది. ఈ ముగ్గురి బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ముగ్గురు నిందితులు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందన్న సీబీఐ న్యాయవాది వాదనతో ఏకీభవించింది.


Tags:    

Similar News