Ys Jagan : జగన్ బెయిల్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది

Update: 2023-11-24 02:56 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ పిటీషన్ దాఖలు చేశారు. దాదాపు పదేళ్ల నుంచి జగన్ బెయిల్ పై ఉంటున్నారని, ఆయన బెయిల్ ను రద్దు చేయాలని రఘురామ కృష్ణరాజు పిటీషన్ దాఖలు చేశారు.

రఘురామ పిటీషన్ పై...
తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ తిరస్కరణకు గురికావడంతో దానిని సవాల్ చేస్తూ రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు ఈ పిటీషన్ పై విచారణ చేయనుంది. కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఆయన వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో ఏం జరగనుందన్నది ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News