Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ తుది జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది

Update: 2025-09-15 04:35 GMT

ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ తుది జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. తుది ఎంపిక జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. మెగా డీఎస్సీలో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 16,347 పోస్టుల భర్తీ కి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేశారు.

16,347 పోస్టుల భర్తీకి...
దీంతో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20వ తేదీన ప్రకటన చేశారు. ఇందుకోసం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ ఆరోతేదీ నుంచి జులై 2వ తేదీ వరకూ రెండు విడతలుగా ఆన్ లైన్ లో పరీక్షలను నిర్వహించారు. జులై 5వవ తేదీన ప్రాధమిక కీ విడుదల చేశారు. ఆగస్టు 1వ తేదీన తుది కీ ఇచ్చారు. ఏడు దఫాలుగా అభ్యర్థుల ధృవపత్రాలను వపరిశీలించిన విద్యాశాఖ అధికారులు తుది ఎంపిక జాబితాను నేడు విడుదల చేసింది.


Tags:    

Similar News