Andhra Pradesh :కల్తీపాలు మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది.
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. రాజమహేంద్ర వరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో కల్తీపాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటనపై శాసన సభలో మాట్లాడిన సీఎం...బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
కల్తీపాల ఘటన చాలా బాధాకరం
శాసన సభలో రాజమహేంద్రవరం ఘటనపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...‘రాజమహేంద్రవరం ఘటనలోని బాధితులు వాంతులు, కడుపునొప్పి, డయాలసిస్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయి పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో వరలక్ష్మీ మిల్క్ డెయిరీ 106 కుటుంబాలకు రోజూ పాల సరఫరా చేస్తోంది. ఈ డెయిరీ నుంచి వచ్చిన పాలను తాగి అనారోగ్యం పాలయ్యారని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో 8 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.