ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది
రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించడం అత్యంత బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు
రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించడం అత్యంత బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసినట్లు కనపడుతుందని అన్నారు. పాలన వదిలేసి అనవసర విషయాలను పట్టించుకోవడం వల్లనే కల్తీరాయుళ్లు యధేచ్ఛగా రెచ్చిపోతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.
ప్రభుత్వం అంటే భయం లేదు....
ప్రభుత్వం అంటే భయం లేదు.. భక్తి లేదన్నారు. అందువల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డెయిరీలలో తనఖీలు చేయాలని ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చివరకు తాగే పాలల్లోనూ కల్తీ జరిగితే ఇక బతికేదెలా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.