Andhra Pradesh : పింఛనుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

పింఛను దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-02-23 12:14 GMT

పింఛను దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి నెల పెన్షన్ పంపిణీ తేదీలపై ముఖ్య సమాచారాన్ని అధికారులు విడుదల చేశారు.మార్చి 2026 పెన్షన్ పంపిణీ తేదీని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలలోనే మార్చి నెల పింఛను ఇంటింటికీ తిరిగి ఇవ్వనున్నారు. మార్చినెల 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 28వ తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఒకరోజు ముందుగానే...
మార్చి 1 ఆదివారం కావడంతో పెన్షన్ ముందుగా శనివారం పంపిణీ చేస్తారు. శనివారం పంపిణీ చేయకుండా మిగిలిపోయిన పింఛన్ల మొత్తాన్ని వచ్చే నెల రెండో తేదీ సోమవారం పంపిణీ చేస్తారు. స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా పింఛను పంపిణీ జరుగుతుంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఈనెల 28వ తేదీన పింఛనుదారులు తమ ఇంటివద్దనే ఉండాలని కోరారు.


Tags:    

Similar News