రేపు జనసేనలోకి సామినేని
నేడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఆయన ఈ నెల 22న జనసేన పార్టీలో చేరనున్నారు.
samineni udaya bhanu
నేడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఆయన ఈ నెల 22న జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ రోజు జగ్గయ్యపేటలో పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వైసీపీ కార్యకర్తల మనోభావాలను అడిగి తెలుసుకోనున్నారు. జగ్గయ్యపేటలో కాంగ్రెస్, వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సామినేని ఉదయభాను వైసీపీ ఓటమితో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
నిన్న సమావేశం...
నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కూడా సామినేని ఉదయభాను కలిశారు. తన రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. తనతో పాటు మరికొందరు నేతలు కూడా జనసేనలో చేరతారని మీడియాకు సామినేని తెలిపారు. కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేతగా వ్యవహరిస్తున్న సామినేని ఉదయభాను చేరికతో జనసేన బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.