Ys Jagan : అల్లు అర్జున్ అరెస్ట్ పై జగన్ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తున్నట్లు తెలిపారు. థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించడం బాధాకరమన్న అల్లు అర్జున్, ఆ ఘటలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అన్యాయమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు.
క్రిమినల్ కేసులు పెట్టడం...
చనిపోయిన మహిళ కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ చెప్పారని, 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో కూడా ప్రకటించారని జగన్ అన్నారు. కానీ ఎటువంటి ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్ పై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై జగన్ అభ్యంతరం తెలిపారు. మహిళ మృతికి అల్లు అర్జున్ ఎలా కారణమవుతారని ఆయన ప్రశ్నించారు.