హైకోర్టుకు అమరావతి రైతులు

అమరావతి రైతులు రాజధానిని కొనసాగించాలని ఆందోళనను కొనసాగిస్తూనే మరో వైపు న్యాయ పోరాటం చేస్తున్నారు

Update: 2022-08-07 06:32 GMT

అమరావతి రైతులు రాజధానిని కొనసాగించాలని ఆందోళనను కొనసాగిస్తూనే మరో వైపు న్యాయ పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో వారు స్పెషల్ లీవ్ పిటీషన్ ను దాఖలు చేశారు. అమరావతిలో నిర్మాణం పూర్తయిన భవనాలను ప్రభుత్వం వదిలేసిందని తెలిపారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆ పిటీషన్ లో అమరావతి రైతులు పేర్కొన్నారు.

ప్రభుత్వ ధనం..
ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాలు ఎనభై శాతం పూర్తయినా ఈ ప్రభుత్వం అలాగే వదిలేసిందని, పేదల నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా మంజూరు చేయడం లేదని పిటీషన్ లో పేర్కొంది. దీనివల్ల ఉద్యోగుల బయట అద్దెకు ఉండటంతో వారికి ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని, ఇది ప్రభుత్వంపై భారమని పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ ధనం వృధా అవుతుందని, వీటిని త్వరితగతిన పూర్తి చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషన్ లో కోరారు.


Tags:    

Similar News