కరకట్ట చంద్రబాబు ఇంటి నుంచి కేతిరెడ్డి లైవ్
చంద్రబాబు,లోకేష్ కు, ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఛాలెంజ్ విసిరారు
చంద్రబాబు,లోకేష్ కు, ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఛాలెంజ్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించ లేకపొతే మీరు రాజకీయాల నుండి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరంలో చెరువును ఆక్రమించుకుని ఫామ్ హౌస్ నిర్మించారని నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ కౌంటర్ ఇచ్చారు.
ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే....
ఉండవల్లిలోని కరకట్ట వద్దగల చంద్రబాబు నివాస సమీపంలోకి చేరుకున్న కేతిరెడ్డి ఫేస్ బుక్ లైవ్ లో చంద్రబాబు నివాసాన్ని చూపిస్తూ ఇది అక్రమ కట్టడం కాదా అంటూ ప్రశ్నించారు. తాను రైతుల వద్ద భూములు కొనుగోలు చేసి నివాసం నిర్మించుకున్నానని, చంద్రబాబులా రైతులను బెదిరించి నది వెంట భూములు లాక్కుని ఫామ్ హౌస్ లు నిర్మించలేదని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు.