సామర్లకోట పేలుడులో మృతులు వీరే

సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది

Update: 2026-02-28 12:33 GMT

సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. బాణాసంచా తయారీ పరిశ్రమయజమాని ఘటన జరిగిన వెంటనే పరరాయ్యారు.

పదకొండు మందిని మాత్రమే గుర్తించి...
మృతుల్లో ఇప్పటి వరకు పదకొండు మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులను అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్‌, గొడతా రాము, గొడతా నానిగా పోలీసులు తెలిపారు. ఇంకా కొద్ది మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.


Tags:    

Similar News