Andhra Pradesh : బాణసంచా తయారీ కేంద్రాలు... మృత్యు లోగిళ్లకు నిలయాలు
ఆంధ్రప్రదేశ్ లో బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు ప్రాణాలు తీస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు ప్రాణాలు తీస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నెలలో అనకాపల్లిలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది మరణించారు.అనకాపల్లి జిల్లాలోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి అక్కడ మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని అప్పుడువిశాఖ కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది మళ్లీ తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోట మండలం వేట్లపాలెంలో బాణసంచా పేలుడు జరిగి దాదాపు 21మంది మరణించారు.
నాడుకూడా సామర్లకోటకు చెందిన...
గత ఏప్రిల్ లో జరిగిన పేలుడు ఘటనలో కూడా మృతులు ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారిగా గుర్తించారు.ఇప్పుడు కూడా తూర్పు గోదావరి జిల్లాలో బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు జరిగింది. ఈ ప్రాంతంలో బాణసంచా తయారీ కుటీర పరిశ్రమలా మారిపోయింది. ఎక్కువ సంఖ్యలో బాణసంచాను తయారు చేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వీటిని పంపుతుంటారు. అయితే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో అగ్నిమాపక శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తరచూ తనిఖీలు చేయాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నార.
ఎన్నో ఏళ్ల నుంచి...
బాణాసంచాలు తయారు చేయడం ఎన్నోఏళ్ల నుంచి వస్తున్నప్పటికీ సరైన నిబంధనలు పాటించ కుండానే పనిచేస్తున్నారు. కార్మికుల భద్రతకు యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రాధమికంగా నిర్ణయించారు. ఇక్కడ తయారయ్యే తారాజువ్వలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దయెత్తున కొనుగోలు చేస్తుంటారని చెబుతున్నారు. బాణసంచా తయారీ పరిశ్రమలో కార్మికులతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది.ఏడాది పాటు ఈ ప్రాంతంలో బాణసంచా తయారీ చేస్తుంటారు.అటువంటి చోట నిఘా కొరవడిందన్నది స్థానికుల ఆరోపణ. సరైన భద్రతాప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.