Chandrababu : వేట్లపాలం ప్రమాద ఘటనస్థలికి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వేట్లపాలెం పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు.

Update: 2026-02-28 13:49 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వేట్లపాలెం పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు.విజయనగరం జిల్లా నుంచి బయలుదేరి నేరుగా రాజమండ్రి కి చేరుకున్న చంద్రబాబు అక్కడినుంచి రోడ్డు మార్గాన సామర్లకోట మండలంలోని వేట్ల పాలెంవద్దకు చేరుకున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్నిఆయన పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

ప్రమాద ఘటనపై ఆరా...
సహాయక చర్యలతో పాటు గాయపడిన వారికి అందుతున్న చికిత్స గురించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఇక్కడ బాణాసంచా పరిశ్రమలో తయారవుతున్న వాటి గురించి, ప్రమాద సమయంలో ఎందరు కార్మికులున్నది? ఎవరుదీనికి యజమాని అని అన్నివివరాలను చంద్రబాబుకు అధికారులకు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కూడా అధికారులను ఆదేశించారు.


Tags:    

Similar News