ఏపీ సీఎస్ గా సాయిప్రసాద్
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటటరీగా సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటటరీగా సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఉదయం 11:33కు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సాయిప్రసాద్ ను ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా నియమించింది. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ చదివారు.
1991 బ్యాచ్ కు చెందిన...
తర్వాత 1991 సెప్టెంబరు 15న ఐఏఎస్ కు ఎంపికై 1992 జూన్ నుండి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేశారు.అనంతరం 1993 సెప్టెంబరు నుండి 1995 ఏప్రిల్ వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్ గా,1995 ఆగస్టు నుండి 1997 మార్చి వరకు గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా పని చేశారు. సాయిప్రసాద్ కు పలు శాఖల అధికారులు అభినందనలు తెలిపారు.