నేటి నుంచి మూడో ప్రపంచ తెలుగు మహాసభలు
నేటి నుంచి మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నాయి
నేటి నుంచి మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నాయి. కోనసీమ జిల్లా అమలాపురంలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్నారు. నేడు, రేపు కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొలిరోజు కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు.
కార్యక్రమానికి హాజరుకానున్న...
మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు నేడు కేంద్రమంత్రులు రామ్మెహన్, శ్రీనివాసవర్మ, ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావులు హాజరుకానున్నారు. తెలుగు భాసను బతికించుకోవడం కోసం, ప్రజల్లో మాతృభాష అవసరాన్ని పెంపొందించేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు తోడ్పడనున్నాయని నిర్వాహకులు తెలిపారు.