ఏపీలో భారీ పేలుడు.. 21 మంది మృతి.. మృతదేహాలన్నీ చెల్లాచెదురు

ఆంధ్ర్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు

Update: 2026-02-28 11:39 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం జరిగిన పేలుడుతో అనేక మంది మృతి చెందగా, దాదాపు ముప్ఫయి ఐదు మంది వరకూ తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి పోయాయి. పేలుడు సమయంలో అక్కడ మొత్తం ముప్ఫయి మంది కార్మికులు పనిచేస్తున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖకు చెందిన సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలు కూడా చేపట్టడం కష్టంగా మారింది.

మృతుల సంఖ్య మరింత...
పేలుడు సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందనిచెబుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలున్నారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. స్థానికులతో పాటు అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద వార్త తెలుసుకున్న కార్మికుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. తమ వారి ఆచూకీ కోసం వెదుకులాడుకోవడం కనిపించింది. ఈ భారీ పేలుడు తో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.
పేలుడు ధాటికి...
పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా లేదా అన్నదానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటన స్థలికి వెళ్లాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.





















Tags:    

Similar News