Chandrababu : హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన చంద్రబాబు

రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చీపురుపల్లి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.

Update: 2026-02-28 07:45 GMT

రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చీపురుపల్లి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విజయనగరం జిల్లా, చీపురుపల్లి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ విద్యార్థినులతో ముచ్చటించారు. వ్యాక్సినేషన్ వల్ల క్యాన్సర్‌ బారిన పడకుండా ఉంటారని విద్యార్థినులకు వివరించి చెప్పారు. సీఎం సమక్షంలో 14 ఏళ్ల లోపు విద్యార్థినులకు వ్యాక్సిన్ వేశారు.

ఉపయోగాలు ఇవీ...
హెచ్‌పీవీ వల్ల ఉపయోగాల గురించి విద్యార్థినులను తెలియచెప్పిన సీఎం చంద్రబాబు, క్యాన్సర్ రాకుండా రక్షణ కోసం ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నామనిఅన్నారు.సంజీవని కార్యక్రమంలో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డుల్లోనూ వ్యాక్సినేషన్ డేటా ఉంచాలని, అనంతరం ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసుపత్రికి అడ్వైజరీ కమిటీని కూడా నియమించాలని సూచించారు.


Tags:    

Similar News