డెడ్‌లైన్ ముగిసింది... పోరుకు సిద్ధం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసింది

Update: 2023-05-08 03:50 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, 76 గంటల్లో కొనుగోలు చేయకపోతే జగన్ ఇంటికి తడిసిన ధాన్యాన్ని తీసుకు వచ్చి అక్కడ పడేసేందుకు సిద్ధం కావాలని చంద్రబాబు నిన్న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన సందర్భంగా పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.

కలెక్టరేట్ల ఎదుట...
అయితే ఇప్పటి వరకూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రేపటి నుంచి ఆందోళనలు ప్రారంభించాలని నిర్ణయించారు. 9,10 తేదీల్లో తహశిల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News