Visakhapatnam : విశాఖ పర్యటనను అడ్డుకుంటాం.. వైఎస్ జగన్ కు వార్నింగ్
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనపై దళిత సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనపై దళిత సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరించాయి. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. జగన్ నర్సీపట్నంలో అడుగు పెట్టే ముందు, దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని కోరాయి. - డాక్టర్ సుధాకర్ మరణానికి జగన్మోహన్ రెడ్డే కారణమని, ఇది ప్రపంచానికి తెలిసిన నిజమని సంఘాలు ఆరోపించాయి. మాస్క్, పీపీఈ కిట్ అందించలేక డాక్టర్ సుధాకర్‌ను బలిగొన్న మీరు, ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కడతానంటే ప్రజలు నమ్మరని విమర్శించారు.
వైద్యుడి ప్రాణాలను కాపాడలేని వారు...
ఒక వైద్యుడి ప్రాణాలనే కాపాడలేని వారు, మెడికల్ కాలేజీ ఎలా నిర్మిస్తారని దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్‌కు జరిగిన అన్యాయంపై, ఆయన మృతిపై ఇంతవరకు న్యాయం జరగలేదని, దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పని పక్షంలో, దళిత సంఘాల ఆధ్వర్యంలో జగన్ పర్యటనను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. రేపు నర్సీపట్నం వస్తున్న సందర్భంగా జగన్ కు దళిత సంఘాలు ఈ హెచ్చరికలు జారీ చేశాయి.