Chandrababu : నేడు వారికీ సీరియస్ వార్నింగ్ ఇవ్వనున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది

Update: 2025-05-06 04:13 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. వివిధ శాఖలపై ఆయన సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకుంటారు. 12.30 గంటలకు దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. గత కొన్ని రోజులుగా వరసగా జరుగుతున్న ఘటనలపై ఆయన అధికారులు, మంత్రి ఆనం రామ్ నారాయణరెడ్డితో చర్చిస్తారు.

వరసఘటనలపై...
తిరుపతిలో తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించడం, సింహాచలంలో గోడకూలి ఏడుగురు మృతి చెందడం వంటి ఘటనలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. దీంతో ఈరోజు దేవాదయ శాఖ అధికారులకు చంద్రబాబు గట్టిగా క్లాస్ పీకే అవకాశముందని తెలిసింది. ఏదైనా ఈవెంట్ కు తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకోకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించనున్నారు. మరోవైపు మధ్యాహ్నం 2.30 గంటలకు సీఆర్డీఏ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు బనకచర్ల ప్రాజెక్టుపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబునాయుడు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News