Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. అధికారిక కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడ మురళీ ఫార్చ్యూన్ హోటల్లో జరిగనున్న పశు సంవర్థక శాఖ టెక్ AI 2.0 కాన్‌క్లేవ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.
పొలిట్ బ్యూరోలో...
మధ్యాహ్నం 1.15 గంటలకు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు చేరుకుంటారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. పాల్గొంటారు. మహానాడు ఏర్పాట్లు, పార్టీలో యువతకు ప్రాధాన్యతపై చర్చించనున్నారు. రాత్రి ఏడు గంటలకు ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చంద్రబాబు చేరుకుంటారు.