Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఏంటంటే?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది

Update: 2025-02-03 05:51 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఆయన ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి వెళతారు. తర్వాత మధ్యాహ్నం సచివాలయానికి చేరుకుంటారు. వివిధ శాఖలపై అధికారులు, మంత్రులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

ఫీడ్ బ్యాక్ పై...
ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చిన చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు. తర్వాత ఆర్టీజీ తో పాటు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు, ఫీడ్ బ్యాక్ పై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందుతున్నాయా? అనర్హులు ఎంత మంది ఉన్నారన్న దానిపై కూడా చర్చిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు సచివాలయం నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళతారు.


Tags:    

Similar News