Chandrababu : నేడు చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు చంద్రబాబు లకు సచివాలయానికి రానున్నారు. వచ్చిన తర్వాత చంద్రబాబు యోగా దినోత్సవంపై సమీక్ష నిర్వహించనున్నారు. యోగా డే విశాఖలో జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానుండటంతో అవసరమైన ఏర్పాట్లు, భద్రతపై చర్చించనున్నారు.
క్వాంటమ్ వ్యాలీపై...
మధ్యాహ్నం మూడు గంటలకు క్వాంటమ్ వ్యాలీ భవనాల నమూనాపై చంద్రబాబు చర్చిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ బయలుదేరుతారు.ఆరు గంటలకు ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు జరిగే తిరంగా యాత్ర ర్యాలీలో పాల్గొంటారు. రాత్రి 7.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.