Chandrababu : చంద్రబాబు నేటి సమీక్షలు జరిపే శాఖలివే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు గంటలకు సచివాలయానికి చంద్రబాబు చేరుకుంటారు. వివిధ శాఖలపై సమీక్షలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆదాయార్జన శాఖలపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తారు.
కేంద్ర బృందంతో...
తర్వాత కేంద్ర బృందంతో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అకాల వర్షాలు, తడిసిన ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు సచివాలయం నుంచి హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసానికి బయలుదేరుతారు. రాత్రి ఏడు గంటలకు చీఫ్ జస్టిస్‌తో భేటీ అవుతారు. 7.40 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.