జగన్ తల్లికి, చెల్లికి ఆస్తి ఇవ్వకుండా.. చంద్రబాబు హాట్ కామెంట్స్
వైసీపీ అధినేత జగన్ పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెటైర్ వేశారు
వైసీపీ అధినేత జగన్ పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెటైర్ వేశారు. చెల్లికి, తల్లికి ఆస్తి ఇవ్వలేని వారు మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించారని ఎద్దేవా చేశారు. మహిళ సంక్షేమంపై చంద్రబాబు మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ తొలి నుంచి మహిళల పక్షపాతంగా వ్యవహరించిందని, వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.
మహిళా సాధికారితతోనే...
మహిళా సాధికారితతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. మహిళలకు తండ్రి ఆస్తిలో సగం వాటా రావాలని చట్టం తెచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని చంద్రబాబు తెలిపారు. రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లను అమలు చేస్తామని తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో పైకి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు.