మార్కాపురం ఎమ్మెల్యే పనితీరుపై చంద్రబాబు ఏమన్నారంటే?
మార్కాపురం ఎమ్మెల్యే పనితీరు ఆశించిన రీతిలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
మార్కాపురం ఎమ్మెల్యే పనితీరు ఆశించిన రీతిలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అరకొర మార్కులకు వచ్చాయన్నారు. పదమూడు కార్యక్రమాలను పెడితే కేవలం ఎనిమిదింటికి మాత్రమే హాజరయ్యారని అన్నారు. మార్కాపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మార్కాపురం ఎమ్మెల్యేకు 37 శాతం మార్కులు మాత్రమే వచ్చాయని, పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటానని తెలిపారు. చిట్టా చూసిన తర్వాత చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. ఎమ్మెల్యేల పనితీరుపై తాను ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు.
కార్యకర్తలు ఎప్పుడూ...
కార్యకర్తలు ఎప్పుడూ పార్టీ విజయం కసమేపనిచేస్తారన్నారన్నారు. కానీ నేతలు మాత్రం పదవుల కోసం పనిచేస్తారని చంద్రబాబు చమత్కరించారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రమే కాదు వచ్చే ఎన్నికల్లోనూ ఖచ్చితంగా టీడీపీ గెలవాలని, అందుకు కార్యకర్తలు పనిచేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. కార్యకర్తలకు అండగా తాను నిలబడతానని చంద్రబాబు అన్నారు. కార్యకర్తల బలమే టీడీపీ విజయానికి కారణమని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలను ఏ ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేసినా ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.