Chandrababu : జగన్ భద్రతపై ఢిల్లీలో స్పందించిన చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్ భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు

Update: 2025-02-20 13:02 GMT

వైసీపీ అధినేత జగన్ భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని అన్నారు. కోడ్ ఉన్నందున రావద్దని పోలీసులు చెప్పారని, కోడ్ అమలులో ఉన్నందున భద్రత కల్పించడానికి వీలులేదని జగన్ వద్దకు పోలీసులు వెళ్లలేదన్నారు. ఎన్నికల అధికారుల అనుమతి కూడా తీసుకోలేదని చంద్రబాబు తెలిపారు.

ఎన్నికల కోడ్ నిబంధన...
జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలిసి ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించానని చెబుతున్నారని, అయితే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం వల్ల అతనిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. తన రాజకీయ జీవితంలో జగన్ లాంటి రాజకీయ నాయకుడిని ఎన్నడూ చూడలేదని చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News