తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మరోసారి మంత్రి అయ్యారు
మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మరోసారి మంత్రి కాబోతున్నారు. తొలి మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు స్థానం దక్కలేదు. అదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీగా ఉండటం, మండలిని జగన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈయన పంట పండింది. శెట్టి బలిజ సామాజికవర్గం కింద ఈయనకు మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి చేపట్టి కేవలం రెండేళ్లు మాత్రమే అయింది. దీంతో మరోసారి జగన్ ఆయనకు మంత్రి పదవిని రెన్యువల్ చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా గతంలో పనిచేశారు. ఇప్పుడు కూడా జగన్ అదే శాఖను కంటిన్యూ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.