రెండో రోజు విచారణకు లక్ష్మీదుర్గ

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో నేడు సిట్ ఎదుట రెండో రోజు విచారణ జరుతోంది

Update: 2026-03-17 05:34 GMT

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో నేడు సిట్ ఎదుట రెండో రోజు విచారణ జరుతోంది. విచారణకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ హత్య కేసులో ప్రమేయంపై సిట్ అధికారులు లక్ష్మీదుర్గను సుదీర్ఘంగా విచారణ చేశారు.

వీడియో రికార్డింగ్ చేసి...
పలు విషయాలను ఆమె నుంచి రాబట్టారు. లక్ష్మీదుర్గ స్టేట్ మెంట్ ను వీడియో రికార్డింగ్ కూడా చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో లక్ష్మీదుర్గ అలియాస్ రోజాను విచారణ అధికారి, ఎస్‌డీపీవో మనీశ్ దేవరాజ్ పాటిల్ ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ-1 ఎమ్మెల్సీ అనంతబాబుకాగా ఏ-2 లక్ష్మీదుర్గ అని పోలీసులు చెబుతున్నారు.


Tags:    

Similar News