Chandrababu : నేడు వేమూరు నియోజకవర్గానికి చంద్రబాబు
నేడు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు
నేడు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. భట్టిప్రోలు మండలం సూరేపల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. రెవెన్యూ సమస్యలపై రైతులు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
టీడీపీ కార్యకర్తలతో...
సూరేపల్లిలో పంట పొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించనున్నారు. మధ్యాహ్నం వేమూరు నియోజకవర్గ టీడీపీ క్యాడర్‌తో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు.